Comments

తృటిలో చంద్రబాబు కు పెను ప్రమాదం తప్పింది..

కొద్దీ సేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెను ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఢిల్లీ లో జరుగుతున్న ఇండోసాన్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న చంద్రబాబు , మీడియా తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా సెంట్రలైజ్‌డ్‌ ఏసీ సిలిండర్‌ పెద్ద శబ్దంతో పేలింది..పేలుడు శబ్దంతో చంద్రబాబుతో సహా మిగతా వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
చంద్రబాబును ప్రమాదం జరిగిన వెంటనే కమాండోలు, అధికారులు బయటికి తీసుకొచ్చారు. సిలిండర్ గ్యాస్ లీకే ఈ ఘటనకు కారణం అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Share on Google Plus

About Venkatesh Yadav

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment