దగ్గుబాటి రానా… మూవీ మొఘల్ రామానాయుడు వారసత్వంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన హీరో. అయితే తక్కువ కాలంలోనే తనకంటూ ఓ గుర్తుంపు తెచ్చుకొని కేవలం హీరోయిజమే కాకుండా ఒక నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు రానా అంటే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ,బాలీవుడ్ కీ సుపరిచితమే.
ఇకపోతే రానా అంటే టక్కున గుర్తొచ్చేది ఆరడుగుల హెవీ పర్శనాలిటీ. ఆరడగుల ఆజానభావుడు రానా. అందుకే ఆయన్ని అభుమానులు టాలీవుడ్ హంక్ అని పిలిచుకుంటారు. బాహుబలిలో రానా తన శరీర దారుడ్యం చూపించాడు. కండలు తిరిగిన శరీరంతో భల్లాల దేవుడుగా కనిపించాడు.
ఇప్పుడు బాహుబలి: ది కన్‌క్లూజన్ కోసంఅంతకు మించి అన్నట్లు తయారైయ్యాడు. ఈ పాత్ర కొడం మరింత తీవ్రంగా కసరత్తులు చేసి ఏకంగా ఓ హెవీ వెయిట్ బాడీ బిల్డర్ గా తయారయ్యాడు. ఇందుకోసం కోచ్ కునాల్ గిర్ దగ్గర ప్రత్యెక శిక్షణ తీసుకున్నాడు. రెగ్యలర్ వర్క్ అవుట్, డైట్ క్రమం తప్పకుండా పాటించి కండల వీరుడిగా మారాడు.
సందర్భంగా తీసిన ఓ ఫొటోను రానా తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. ఇలా రానాను ఓ బాడీ బిల్డర్ చూసి అభిమానులు యమా థ్రిల్ ఫీలౌతున్నారు.
0 comments:
Post a Comment