షూటింగ్ లేనప్పుడు తను టీవీతోనే ఎక్కువ సేపు గడుపుతానని చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ ఖాతాలోకి మరో బ్రాండ్ చేరింది. యప్ టీవీ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు మహేష్. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఛానల్ లోగోను ఆవిష్కరించారు మహేష్ .
ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్.. యుప్ టీవీ కుటుంబంలోకి వచ్చి అనుబంధం పెంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఎంటర్ ట్రైన్ మెంట్ అంతా ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ లోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. పైరసీ కూడా దీనిద్వారా నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే మహేష్ ఖాతాలో థమ్సప్, పారగాన్ , రాయల్ స్టాగ్ , వివెల్ షాంపూ,సంతూర్, జొస్ అలూక్కాస్, ఐడియా ..బ్రాండ్లు వున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు యప్ టీవి లో కూడా ఆయన బ్రాండ్ వేసుకుంది.
0 comments:
Post a Comment