Comments

bhinetri gets U/A, film release on 7 October 'అభినేత్రి' సెన్సార్‌ పూర్తి - వరల్డ్‌ వైడ్‌గా అక్టోబర్‌ 7 విడుదల

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌లో నిర్మిస్తున్నారు. హిందీలో సోనూ సూద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అక్టోబర్‌ 7న విజయదశమి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా కోన ఫిలిం కార్పొరేషన్‌ బేనర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి విశేష స్పందన లభిస్తోంది. జి.వి.ప్రకాష్‌కుమార్‌, ఎస్‌.ఎస్‌.థమన్‌ ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ని అందించారు. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది'' అన్నారు.
ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, ప థ్వీ, షకలక శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌.
Share on Google Plus

About Venkatesh Yadav

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment