బాహుబలి 2 నుంచి త్వరలోనే బయటపడనున్న ప్రభాస్ కొత్త సినిమాలకు రెడీ అవుతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా బాహుబలి సినిమాలో బిజీగా ఉండటంతో కొత్త సినిమాలు ఏమీ చేయలేని పరిస్థితి. బాహుబలి 2 తుది దశకు చేరుకుంది. సో ఇక ప్రభాస్ బిజీ బిజీగా మారబోతున్నాడన్న మాట. ఇప్పుడు కొత్తగా పోలీస్ పాత్రలో కొత్త సినిమాలో దర్శనం ఇచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.
‘రన్ రాజా రన్’ ఫేం సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు. భారీ బడ్జెట్ అంటే..దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించనున్నారట. వచ్చే జనవరిలో చిత్రీకరణ మొదలు పెట్టాలనుకుంటున్నారు. దీంతో పాటు ప్రభాస్ కొత్త సినిమాలకు రెడీ అవుతారని చెబుతున్నారు
0 comments:
Post a Comment