దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి 2 తర్వాత ఎలాంటి చిత్రం చేయబోతున్నాడు..? ఎవరితో చేస్తాడు..? అనే ప్రశ్నలు అందరిలో మెదులుతున్నాయి..కాగా తాజాగా ఫిలిం సర్కిల్ లో రాజమౌళి నెక్స్ట్ సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
బాహుబలి 2 తర్వాత రాజమౌళి ఓ ప్రేమ కావ్యాన్ని తీయబోతున్నాడట..ఇందులో నేచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి..ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానప్పటికే సోషల్ మీడియా లో మాత్రం ఈ వార్త తెగ ప్రచారం అవుతుంది. గతం లో రాజమౌళి మగధీర చిత్రం చేసిన తర్వాత మర్యాద రామన్న చేసి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెల్సిందే..మరోసారి అదే ప్లాన్ లో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది.
0 comments:
Post a Comment