మెగా హీరో వరుణ్ తేజ్ హాస్పటల్ లో జాయిన్ అయ్యాడనే న్యూస్ మెగా అభిమానులను షాక్ కు గురిచేస్తుంది..ప్రస్తుతం వరుణ్ తేజ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఊటీలో మొదలుపెట్టుకుంది. కాగా వరుణ్ తేజ్ తదితరులపై ఓ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తుండగా వరుణ్ తేజ్ గాయపడినట్టుగా తెలుస్తోంది.
వెంటనే వరుణ్ ను హాస్పటల్ లో జాయిన్ చేయగా , వరుణ్ ను పరీక్షించిన డాక్టర్స్ ఖంగారుపడాల్సిన పనేమిలేదని రెండు , మూడు వారలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారని సమాచారం. దాంతో ఈ సినిమా షూటింగును ఆపేసినట్టు తెలుస్తుంది.
0 comments:
Post a Comment