ఈమధ్యనే హీరోయిన్ సమంత హిందూ మతంలోకి మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సమంత పేరు కూడా మారిపోయిందట. అవును... సమంత ఇప్పుడు చిన్న మేడమ్ అయిపొయింది. అన్నపూర్ణ స్టూడియోలో స్టాఫ్ తో పాటు, నాగార్జున ఇంట్లో పనివారు, స్టాఫ్ కూడా సమంతను ఇలాగే పిలుస్తున్నారట. అంతా సమంతను చిన్న మేడమ్ అంటున్నారు. కొత్త పిలుపు బాగుందని సమంత ఓకే చెప్పిందట. ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ లో పెద్ద మేడమ్ అంటే అమల, చిన్న మేడమ్ అంటే సమంత అని ఫిక్స్ అయిపొయారు.
మరోవైపు సమంత-నాగచైతన్య కలసి పెళ్ళికి ముందే విదేశాలకు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యారు. అయితే డేటింగ్ కోసమని అనుకునేరు....షాపింగ్ కోసం. అవును....తమ పెళ్ళికి దుస్తులు కొనుక్కునేందుకు చైతన్య, సమంత విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారట. ఎక్స్ క్లూజివ్ గా లండన్, పారిస్ నగర్లో ఓ వారం రోజులపాటు షాపింగ్ చేయాలనీ అనుకుంటుందట ఈ జంట. ఈ షాపింగ్ యవ్వారం తర్వాత పెళ్లిపై అధికారికంగా ఓ తేది ప్రకటన రానున్నది.
0 comments:
Post a Comment