ఓవైపు హ్యాట్రిక్ హిట్స్ సాధించిన స్టార్ డైరెక్టర్, మరోవైపు తెలుగులో అత్యంత క్రేజీ హీరోగా నిలదొక్కుకున్న స్టార్ స్టార్ హీరో. ఇద్దరూ రికార్డులకు పెట్టింది పేరే. లోఉన్నా మరో కామన్ ఎలిమెంట్ సామాజిక దృక్పధం. ఈ విధమైన సామాజిక అంశాలను కమర్షియల్ సూత్రాలతో ప్రేక్షకులకు అందించడానికి ఓ దర్శకుడు తపన పడుతుంటే...కమర్షియల్ రంగుల బయట జీవితంలో సామాజిక మేలే ధ్యేయమని ఓ హీరో నిరూపిస్తున్నాడు.
ఆ దర్శకుడు కొరటాల శివ అని, ఆ హీరో పవన్ కళ్యాణ్ అని అర్ధమైపోయి ఉంటుంది. పరిశ్రమలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం వీరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకేక్కుతుందట. కొరటాల శివ ప్రత్యేకంగా పవన్ కోసం ఓ కథని సిద్దం చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఏ విషయం అధికారికంగా దృవీకరించలేదు.
బోయపాటి బాలయ్య కి ఎన్నికల సమయంలో లెజెండ్ వంటి కథ రాసి హెల్ప్ చేశాడు. ఇప్పుడు పవన్ నడుపుతున్న జనసేన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని కొరటాల శివ కథ సిద్దం చేస్తున్నాడు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల మాత్రం మహేష్ సినిమా తప్ప మరోకటి కమిట్మెంట్ ఇవ్వలేదు.
0 comments:
Post a Comment