నేచురల్ స్టార్ నాని, అను ఇమాన్యుయేల్, ప్రియా శ్రీ హీరో హీరోయిన్లుగా 'అంత:పురం', 'ఒకరికొకరు', 'నువ్వు నేను' రీసెంట్‌గా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'బీరువా' వంటి సూపర్‌హిట్ చిత్రాల్ని నిర్మించిన ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత పి.కిరణ్ కేవ మూవీస్ అధినేత్రి గీత గొల్ల సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మజ్ను'.'ఉయ్యాల జంపాల' ఫేం విరించివర్మ దర్శకత్వంలో రూపొందిన 'మజ్ను' చిత్రం సెప్టెంబర్ 23న విడుదలైందొ. ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తూ చిత్ర యూనిట్ విజయయాత్రను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ - ''మజ్ను సక్సెస్‌ను టీం అందరూ ఎంజాయ్ చేశారు. వర్షాలు కారణంగా సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటుందోనని భయపడ్డాను. కానీ ప్రేక్షకులు సినిమాను అద్భుతంగా ఆదరించారు. సినిమాకు చాలా మంచి ఓపెనింగ్‌తో పాటు, మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ విజయాన్ని ప్రేక్షకులతో సెలబ్రేషన్స్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకని రేపటి నుండి విజయయాత్రను కొనసాగించనున్నాం. సినిమా విడుదల సమయంలో ముఖ్యంగా యూత్‌కు నచ్చుతుందని అనుకున్నాం కానీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. దర్శకుడు విరించి వర్మ అందరికీ నచ్చేలా సినిమా తెరకెక్కించాడు. నేను సినిమాను మొదటిరోజు మా కుటుంబ సభ్యులు 40 మందితో కలిసి సినిమా చూశాను. అందరికీ సినిమా బాగా నచ్చింది. ముఖ్యంగా మా అమ్మకు సినిమా బాగా నచ్చింది. రాజమౌళిగారు కూడా సినిమాను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో గమనించాను. ఆయన సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. సినిమా పూర్తి కాగానే ఆయన్ను వెళ్ళి కలుసుకున్నాను. ఆయన నన్ను హగ్ చేసుకున్నారు. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలో లవ్ లెటర్ కాన్సెప్ట్ అందరికీ బాగా నచ్చింది. సినిమాలో హీరో ప్రేమ సక్సెస్ కావడానికి లవ్ లెటర్ కీ రోల్ పోషించింది. నిజానికి ఈ లెటర్‌ను రాసింది ఆనంత్ శ్రీరాంగారే. సినిమా చూస్తున్నంతసేపు మనలోని మేధావికి నచ్చేలానే కాకుండా, పిల్లవాడికి నచ్చేలా సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇక వరుస విజయాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ సక్సెస్‌కు ఎక్కడో బ్రేక్ పడుతుందని తెలుసు. అయితే ఈ సక్సెస్‌ల సంఖ్య పెరుగుతుండటం కూడా ఒక చిన్న భయాన్ని క్రియేట్ చేసింది'' అన్నారు.
ఆనంది ఆర్ట్స్ అధినేత పి.కిరణ్ మాట్లాడుతూ - ''భారీ వర్షాల్లో కూడా ప్రేక్షకులు మజ్ను సినిమాను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందుకు వారికి థాంక్స్ చెప్పడానికి విజయయాత్రను నిర్వహిస్తున్నాం. సెప్టెంబర్ 30న వైజాగ్, రాజమండ్రిలలో, అక్టోబర్ 1న ఏలూరు, విజయవాడల్లో యాత్ర జరుగుతుంది. యూనిట్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇక్కడ కూడా విజయయాత్రను ప్లాన్ చేస్తాం'' అన్నారు.దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ - ''మొదటి సినిమా కంటే రెండో సినిమాకు చాలా టెన్షన్ పడ్డాను. వర్షాలు కారణంగా ముందు భయపడ్డ మాట నిజమే అయితే ప్రేక్షకులు సినిమాను పెద్ద హిట్ చేశారు. సినిమా చూసి చాలా మంది యువకులు బావుందని అప్రిసియేట్ చేశారు. మా ఊరు నుండి చాలా మంది కుర్రాళ్ళు సినిమా బాగా తీశానని ఫోన్ చేసి అభినందించారు. నాని ఎంతో సపోర్ట్ చేశాడు. తనతో సినిమా చేయడమంటే కాలేజ్‌కు వెళ్ళి చదువుకుని వచ్చినంత ఈజీగా ఫీలయ్యాను. నానితో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని ఉంది. అలాగే కిరణ్‌గారు, గీతగారు మేకింగ్‌లో ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో సన్నివేశాలన్నీ కల్పితాలే. అయితే ఇందులో హీరో ఫ్రెండ్ పేరును, నా బెస్ట్ ఫ్రెండ్ కాశీ పేరును పెట్టుకున్నాను. సినిమాలో లవ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్ ఫీలయ్యారు కాబట్టే సినిమాను పెద్ద సక్సెస్ చేశారు'' అన్నారు.
ఈ కార్యక్రమంలో అనుఇమాన్యుయల్, గోళ్ళ గీత పాల్గొన్నారు.
0 comments:
Post a Comment