బి-టౌన్ లో జాన్ అబ్రహం ఫై పెద్ద చర్చ జరుగుతుంది..సెల్ఫీ అడిగితే సదరు హీరో అభిమానిని చెంప దెబ్బ కొట్టాడని న్యూస్ హాట్ హాట్ గా మాట్లాడుకుంటున్నారు..వివరాల్లోకి వెళ్తే..
జాన్ అబ్రహం- సోనాక్షి జంటగా తెరకెక్కిన ‘ఫోర్స్-2’ చిత్ర ట్రైలర్ నిన్న అభిమానుల సమక్షం లో లాంచ్ చేయడం జరిగింది..ఈ ట్రైలర్ లాంచ్ చేసిన జాన్ , ఆ ఈవెంట్ పూర్తియిన వెంటనే స్టేజ్ మీద నుండి కిందకు వెళ్లిపోవడం జరిగింది. ఈ క్రమం లో ఒక్కసారిగా అభిమానులు అతడి ఫై రావడం తో , వారినుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాడు. ఈ క్రమం లో ఓ అభిమాని జాన్ చెయ్యిపట్టి లాగి సెల్ఫీ తీసుకోబోయాడట. దీంతో కోపం తెచ్చుకున్న జాన్ అతడిని చెంప దెబ్బ కొట్టడమే కాక ఈ సంఘటనను ప్రచురించవద్దని అక్కడున్న మీడియాకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడట.
0 comments:
Post a Comment