యూరి ఉగ్రదాది నేపధ్యంలో బాలీవుడ్ పరిశ్రమలోని పాకిస్తాన్ నటులు 48 గంటల్లో దేశం వదిలి వెళ్లాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ...బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్య చేశాడు. పాకిస్తాన్ ఆర్టిస్ట్ లు భారత్ కు రావాలని పిలుపుని ఇచ్చారు సల్మాన్. యూరి ఘటనకు పాల్పడింది ఉగ్రవాదులే...కానీ నటీనటులు కాదని, పాక్ ఆర్టిస్టులు టెర్రరిస్ట్ లు కాదని చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్.
సరైన వీసా పర్మిట్ తో భారత్ కు రావాలని పిలుపునిచ్చారు. ఎంతోమంది పాక్ కళాకారులు ఇక్కడ నివసించడానికి వాలిడ్ విస్సా ఉన్నదని అన్నాడు. కాగా ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కూడా పాకిస్తాన్ నటీనటులు, టెక్నీషియన్స్ పై నిషేధం విధించిన నేపధ్యంలో సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై ఎలాంటి అభిప్రాయలు వ్యక్తం అవుతాయో చూడాలి.
0 comments:
Post a Comment